ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసిన దుండగులు

by Sumithra |
ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసిన దుండగులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి యత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు. ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఆలీ, మిర్జా అయాన్ బేగ్, నిజామాబాద్ కు చెందిన మహ్మద్ అర్భాజ్ లు బ్యాంక్ ఏటీఎంలలో చొరబడి వాటిని ధ్వంసం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. గురువారం ఉదయం ముగ్గురిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది వారిని పట్టుకుని అరెస్టు చేశారని, ముగ్గురిని రిమాండ్ కు పంపినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.

Advertisement

Next Story