- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూర్ లో దొంగల వీరంగం..
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో దొంగలు సోమవారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. హౌసింగ్ బోర్డ్ ఏరియాలోని విష్ణు అపార్ట్మెంట్, మహాలక్ష్మి కాలనీ, వైష్ణవి రెసిడెన్సీలోకి ప్రవేశించి చోరీలు చేసేందుకు ప్రయత్నించారు. దొంగలు అర్ధరాత్రి సమయంలో ముఖాలకు ముసుగులను కట్టుకొని అపార్ట్మెంట్ లో తిరుగుతూ చోరీ చేసేందుకు రెక్కీ చేశారు. ఈ దృశ్యాలు పరిసరాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. రెండు కాలనీలో ముసుగులు ధరించిన దొంగలు సోమవారం రాత్రి హల్ చల్ చేయగా..ఎక్కడా చోరీ జరగకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో..ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో దొంగలు విపరీతంగా సంచరిస్తున్న నేపథ్యంలో..ఆర్మూర్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి దొంగల ఆగడాలను అరికట్టాలని ఆర్మూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.