- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > కూలిన స్కూల్ ప్రహరీ గోడ.. స్టూడెంట్లకు కొద్దిలో తప్పిన పెను ప్రమాదం
కూలిన స్కూల్ ప్రహరీ గోడ.. స్టూడెంట్లకు కొద్దిలో తప్పిన పెను ప్రమాదం
by Nagam Mallesh |
X
దిశ, వేల్పూర్ : మండల కేంద్రంలోని అమినాపూర్ గ్రామంలో జిల్లా ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ సోమవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకులిపోయింది. శ్రీ కృష్ణాష్టమి పండగ సందర్భంగా స్కూల్ కి సెలవు కాబట్టి విద్యార్థులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ ప్రహరీ గోడ చాలా చోట్ల పగుళ్ళు ఏర్పడ్డా.. వాటిని మరమ్మత్తులు చేయలేక అలాగే వదిలేయడం వల్ల ఈ మధ్యన కురిసిన వర్షానికి గోడ పూర్తిగా దెబ్బ తిని కూలిపోయిందన్నారు. స్కూల్ సెలవు కాబట్టి పిల్లలు లేరు, అదే స్కూల్ నడుస్తున్నపుడు ప్రమాదం జరిగితే పిల్లలకి జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రహరీ గోడ విషయమై చాలా సార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఎవరు కూడ పట్టించుకోలేదని గ్రామ ప్రజలు తెలిపారు.
Advertisement
Next Story