- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
sandalwood trees : గంధపు చెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు..
దిశ, తాడ్వాయి : ఓ రైతు వ్యవసాయ బావి దగ్గర పెంచుతున్న గంధపు చెట్లను ( sandalwood trees ) గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన రైతు అకేటి శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ బావి దగ్గర, వ్యవసాయ పొలం ఒడ్ల చుట్టూ నాలుగు సంవత్సరాల క్రితం పది గంధపు చెట్లను నాటుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు వ్యవసాయ బావి దగ్గర పనులు చేసుకుంటూ రాత్రి సమయంలో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు కాపలాగా ఉండేవారిమని వారు అన్నారు.
ఆదివారం రాత్రి సమయంలో వ్యవసాయ బావి ( Agricultural well ) దగ్గర ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని దొంగలు ఏడు గంధపు చెట్లను యంత్రాల సహాయంతో కోసి దొంగిలించారన్నారు. ఉదయం రైతు వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లి చూడగా యంత్రాలతో కట్ చేసి చిన్నచిన్న కొమ్మలను ఘటనా స్థలం దగ్గర వదిలేసి పెద్ద దుంగలను ఎత్తుకెళ్లినట్లు రైతు తెలిపారు. దొంగిలించిన ఆ ఏడు గంధం చెట్ల విలువ లక్ష వరకు ఉంటుందని రైతు అన్నారు.