కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

by Naveena |
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు. పర్యవేక్షణ అధికారిణి ఎక్కడ ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించగా..సమ్మేలో పాల్గొంటున్నారని డ్యూటీ టీచర్ తెలిపారు. బాధ్యత కలిగిన వారు అందుబాటులో ఉంటూ.. పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. సరుకులను స్టీల్ డబ్బాలలో నిల్వ ఉంచి, తప్పనిసరిగా వాటికి మూతలు బిగించాలని, కూరగాయలు, ఇతర సరుకులను నేలపై ఉంచకూడదని హితవు పలికారు. విజయ కంపెనీ వంటనూనె, విజయ డైరీ పాలను వినియోగించాలని సూచించారు..నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, కస్తూర్బా ఉపాధ్యాయ బృంద సభ్యులు, ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed