- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనాటి కట్టడాలు చరిత్రకు ఆధారాలు
దిశ, ఆర్మూర్ : పూర్వం అల్లకొండలో నిర్మించిన ఇంజనీరింగ్ విధానం గొప్పదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి అన్నారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని విశాఖ నగర్ కాలనీలో గల ఎంపీ కార్యాలయంలో బాల్కొండ కు చెందిన బీఆర్. నర్సింగ్ రావు అల్ల కొండ ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి అనే చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశంలోని పురాతనమైన కట్టడాలకు మరమ్మతులు చేయకుండా వదిలి వేస్తే ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. పూర్వ చరిత్ర గల కట్టడాల రక్షణ, పునర్నిర్మాణాలు చేయాలంటే పార్లమెంట్ ద్వారా పాత చట్టాలు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన చట్టం తేవడానికి
ఈ అంశం పై చర్చించి భావి తరాలకు గుర్తుండి పోయే విధంగా చట్టం తేవడానికి ప్రయత్నిస్తానని అన్నారు. పూర్వ చరిత్రను వెలుగు లోకి తెస్తున్న పుస్తక రచయిత నర్సింగ్ రావు ను ఎంపీ అరవింద్ అభినందించారు. ఊరు చుట్టూ ఖిల్లా కు చెందిన భూములు ఉండేవని, కొందరు కబ్జా చేసి అక్రమ కట్టడాల చేస్తున్నారని తెలిపారు. వీటిని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని బాల్కొండ ఖిలాని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎంపీని అక్కడి వారు కోరారు. కాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఖిలా మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని
కోరుతూ అల్లకొండ ఖిలా పరిరక్షణ సమితి ద్వారా భారత ప్రధాన మంత్రిని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైన ధర్మపురి అరవింద్ ని అల్ల కొండ ఖిలా పరిరక్షణ సమితి కోరింది. బాల్కొండ ఖిలాకు 10 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్ల కొండ ఖిలా పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు భూసం సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు బి. ఆర్.నర్సింగ్ రావు, సంయుక్త కార్యదర్షులు సంతోష్ కుమార్, పి. నవీన్ కుమార్, డి.పవన్ కుమార్, సభ్యులు పురుషోత్తం, ఎం.మారుతి,పాండు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- mp Aravind