తల్లిదండ్రుల కలలను విద్యార్థులు నిజం చేయాలి

by Sridhar Babu |
తల్లిదండ్రుల కలలను విద్యార్థులు నిజం చేయాలి
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులలో కంప్యూటర్ పై పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఆర్థిక అక్షరాస్యత పైన నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రస్తుత తరుణంలో ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం అని,

పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలోని తమ తల్లి దండ్రులకు ఈ విషయమై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీఈ ఓ రాజు అన్నారు. ఆర్థిక అక్షరాస్యత పై వ్యాస రచన పోటీలో అడ్లూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.రక్షిత, నినాద పోటీలో బీబీ పేట ఉన్నత పాఠశాల విద్యార్థిని వి. రేణుక, పోస్టర్ మేకింగ్ పోటీలో అడ్లూర్ పాఠశాల విద్యార్థిని కె. శృతిక జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది రెండు వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ భార్గవ సుధీర్ ,సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు వేణుగోపాల్ ,నాగ వేందర్ , వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, విశ్వ మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed