Liquor Tenders: ఆశావహులకు భారీ గుడ్ న్యూస్.. మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంపు

by Shiva |   ( Updated:2024-10-09 04:33:59.0  )
Liquor Tenders: ఆశావహులకు భారీ గుడ్ న్యూస్.. మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం షాపులను దక్కించుకోవాలని భావిస్తున్న ఆశావహులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు కొత్త మద్యం దుకాణాల (Liquor Shops) దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల షెడ్యూల్‌ (Schedule of Tenders)ను మార్చాలంటూ వివిధ జిల్లాల్లో ఉన్న దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఎక్సైజ్ అధికారులు (Excise Officers) విషయాన్ని సర్కార్ దృష్టి తీసుకెళ్లడంతో లిక్కర్ టెండర్ల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఈనెల 11 సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 14న మద్యం షాపులకు లాటరీ తీసి.. 16 నుంచి దరఖాస్తుదారులకు షాపులను కేటాయిస్తారు.

కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు గాను మంగళవారం రాత్రి వరకు 41,348 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు (Excise Officers) వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed