- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవి చాలా భావోద్వేగ క్షణాలు.. మాటల్లో వర్ణించలేనుంటూ నితిన్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: ఢిల్లీ వేదికగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం వేడుక జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ తండ్రి ముఖేష్ గౌతమ్ తెరకెక్కించిన ‘భాఘీ దీదీ’ ఉత్తమ పంజాబీ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఇదే విషయంపై యామీ గౌతమ్ స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రియాక్ట్ అయింది. ‘‘డైరెక్టర్‌గా మా నాన్న మొదటి జాతీయ అవార్డును అందుకుంటున్నారు. ఇవి చాలా భావోద్వేగ క్షణాలు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంత గొప్ప వ్యక్తికి కూతురుగా పుట్టినందుకు గర్వంగా ఉంది.
ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. సినిమాలపై ఆయనకు ఉన్న అభిరుచి, అంకిత భాగం ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టాయి. నాతో పాటు మా కుటుంబమంతా గర్వపడుతుంది’’ అని రాసుకొచ్చింది. అలాగే తన తండ్రి అవార్డు తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేసింది.
కాగా, యామీ గౌతమ్ తెలుగులో గౌరవం, యుద్ధం సినిమాల్లో నటించింది. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల యామీ గౌతమ్ ‘ఆర్టికల్- 370’ మూవీతో ప్రేక్షకులను అలరించింది.
Read More : ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్