- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ అగ్ర హీరో కుమార్తెపై కుర్ర హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !!
దిశ, వెబ్‌డెస్క్: నటుడు వేదాంగ్ రైనా బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ పై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జిగ్రా ప్రమోషన్స్‌లో భాగంగా వేదాంగ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తన మొదటి సినిమా రోజులను గుర్తు చేసుకున్నాడు. కోస్టార్స్ అయిన సుహానా ఖాన్ అండ్ ఖుషి కపూర్ గురించి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. ఇక సుహానా మేకప్ గురించి మాట్లాడుతూ.. తను చాలా సేపు మేకప్ వేసుకునేదని వేదాంగ్ సరదాగా వెల్లడించారు. అలాగే తను అందరితో చాలా బాగా మాట్లాడుతుందని, తొందరగా కలిసిపోతుందని తెలిపాడు. ఎప్పుడైనా సుహానా కోపం తెప్పించిందా అని యాంకర్ అడ్డగా..
ఈ ప్రశ్నకు వేదాంగ్.. తను తయారు అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి అందరం తన కోసం వెయిట్ చేసేవాళ్లమని అన్నాడు. అబ్బాయిలంతా 15 నిమిషాల్లో తయారు అయ్యేవాళ్లమని తెలిపాడు. అలాగే మేకప్ బాలేదంటూ టేక్స్ మధ్యలో సుహానా టీమ్ కు అంతరాయం కలిగించేదని వెల్లడించారు. ఈ కారణంగా కొంచెం ఇబ్బందిగా అనిపించేదని, కానీ తన తప్పేంలేదని.. సుహానా పోషించే పాత్ర అలాంటిదని వివరించాడు. తర్వాత ఖుషి కపూర్ కూడా సుహానాపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. తన మనసు చాలా మంచిదని, చాలా స్వీట్ అని కొనియాడింది. అందరితో సరదాగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వేదాంగ్ అండ్ ఖుషి కపూర్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.