ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ.. మూడు ముక్కలైన ట్రాక్టర్

by Jakkula Mamatha |
ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ.. మూడు ముక్కలైన ట్రాక్టర్
X

దిశ,వర్థన్నపేట: ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ మూడు ముక్కలై ఇద్దరు డ్రైవర్లకు గాయాలైన సంఘటన బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల శివారు పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు వరంగల్‌కు వేళ్ళుతున్న క్రమంలో కట్రియాల గ్రామ శివారులో ని పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ బస్సు ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ట్రాక్టర్ మూడుముక్కలై చెల్లాచెదురుగా పడింది. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి శ్రీను గా గుర్తించారు. పండుగ వేళ బందువుల ఇంటికి బస్సులో వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ముందు భాగం ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed