Mental Health: చెవిలో రకరకాల గుసగుసలు.. ఈ వ్యాధే కారణమా?

by Anjali |
Mental Health: చెవిలో రకరకాల గుసగుసలు.. ఈ వ్యాధే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్: మానవ శరీరంలో అత్యంత సున్నితమైన వాటిలో చెవి కూడా ఒకటి. చెవితో దీనికంటే సున్నితమైనది టిమ్పానిక మెమ్బ్రేన్ అనే మరో పార్ట్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు చెవిలోకి క్రిములు, అలర్జీ, విపరీతమైన చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, చెవిలోకి వాటర్ వెళ్తే.. ఇలా చెవిలో పలు సమస్యలు తలెత్తి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరో ప్రమాదకరమైన వ్యాధుల్లో మరోకటి ఉంది. చెవిలో ఎప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతున్నట్లు వినిపిస్తుంటుంది. పక్కన ఎవరు లేకున్నా.. ఎవరో ఉండి మాట్లాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తుంటాయి. సమ్ టైమ్స్ వారికి ఇతరులు తిడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుంది.

తాాజా పరిశోధనలో ఏం తేలింది..?

ఇలాంటి సమస్యతో బాధపడుతోన్న వారు చాలా ఇబ్బంది పడుతారు. కాగా తాజాగా దీనిపై పరిశోధకులు అధ్యయనం చేయగా.. అసలు దీనికి కారణం ఏంటో బయటపడింది. న్యూయార్క్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కేవలం వారు ఊహించుకోవడం వల్లే జరుగుతుందని పరిశోధనలో తేలింది. దీంతో వారు భయభ్రాంతులకు గురవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి..

ఇంద్రియాల సమాచారాన్ని చేరవేయడానికి మెదడు సామర్థ్యం సరిపోనప్పుడు ఇలా వారి మెదడు వీక్ అయి.. ఈ సమస్య బారిన పడుతారని అధ్యయనం చెబుతుంది. ఈ వ్యాధిని స్కిజోఫ్రెనియా అని అంటారు. కాగా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతోన్న వారు తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed