ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్

by Kavitha |   ( Updated:2024-10-09 06:50:48.0  )
ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్ట్‌లతో దుమారం సృష్టిస్తుంది. గతంలో ఓ స్టార్ డైరెక్టర్ పైన, అలాగే స్టార్ హీరో కమ్ పొలిటిషన్ పైన ట్వీట్‌లు చేస్తూ వార్తల్లో నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ భామ మరోమారు తన ట్వీట్‌తో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడని నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. అయితే ‘MAA’ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందని, అతడు లీడర్‌గా మారిన నటుడు కాదని ఆమె హింట్ ఇచ్చారు. అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు/ రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారని వాపోయారు. ఇక ఈ ట్వీట్‌లో ఎవరి పేర్లు ప్రస్తావించక పోవడం గమనార్హం. కాగా ఇటీవల పూనమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Trivikram Srinivas : "సమంత వ్యక్తి కాదు.. ఓ శక్తి"


Advertisement

Next Story

Most Viewed