Viral : మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. అంతలో ల్యాప్‌‌టాప్ పట్టుకుని అతనేం చేశాడంటే..

by Javid Pasha |
Viral : మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. అంతలో ల్యాప్‌‌టాప్ పట్టుకుని అతనేం చేశాడంటే..
X

దిశ, ఫీచర్స్: పెళ్లి అంటేనే అదో సందడి వాతావరణం. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వేడుకను ఎంజాయ్ చేస్తారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆనందంగా గడుపుతారు. ఇక వధూ వరుల జీవితంలో అవి మరుపురాని మధుర క్షణాలుగా పేర్కొంటారు. ఉద్యోగాలు చేసే వారైతే.. కొన్ని రోజుల ముందు నుంచే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సెలవు పెడతారు. అప్పటి నుంచి మ్యారేజ్ అయిపోయే వరకు పర్సనల్ విషయాలు తప్ప ప్రొఫెషనల్ అంశాలను పట్టించుకోరు. ఎంత ముఖ్యమైన ఆఫీసు వర్క్ అయినా అవైడ్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. చివరికి తన పెళ్లి రోజు కూడా ల్యాప్ టాప్ పట్టుకొని వర్క్ చేస్తూ కూర్చున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని పేరు కాసే మాక్రెల్. ఒక ఏఐ స్టార్టప్ సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగి. అయితే అతను తన పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చున్నాడు. మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇతను మాత్రం ఆఫీసుకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్‌లో బిజీ అయిపోయాడు. ఈ సన్నివేశాన్ని అతని పెళ్లికి వచ్చిన మరో ఉద్యోగి ఫొటో తీశాడు. ‘వర్క్ చేసే అలవాటును వ్యసనంగా మార్చుకున్న మాక్రెల్ చివరికి మ్యారేజ్ రోజు కూడా పని చేశాడు’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. కాగా అతను చేసిన పనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలా చేయడం అవసరమా? అని కొందరు, అనవసరంగా అతనికి పెళ్లి చేస్తున్నట్లున్నారని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed