‘పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడమే ఆ పార్టీ ప్లాన్’.. సీపీఎం నేత సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-09 03:23:09.0  )
‘పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడమే ఆ పార్టీ ప్లాన్’.. సీపీఎం నేత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాష్ట్రంలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. దీంతో పవన్ బీజేపీ కాషాయ రాజకీయాలను ఫాలో అవుతున్నారని విమర్శలు వచ్చాయి.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమి చెబితే దానికి తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని వామపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపేసి ఆ స్థానంలో పవన్ కల్యాణ్‌ను కూర్చొబెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీని నాశనం చేసేందుకు పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో 100 రోజుల కూటమి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత కనబడుతోందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Advertisement

Next Story