PM Modi: రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by karthikeya |   ( Updated:2024-10-09 03:24:38.0  )
PM Modi: రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (బుధవారం) మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌ మోడ్‌లో ఈ కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. ఇందులో ముఖ్యంగా నాగ్‌పూర్‌ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి రూ.7,000 కోట్ల విలువైన అప్‌గ్రేడింగ్ పనులను ప్రారంభించనున్నారు. అలాగే షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ కార్యక్రమాలను మోడీ ప్రారంభించబోతున్నారు.

అంతేకాకుండా ముంబై, నాసిక్, అమరావతి సహా మహారాష్ట్ర అంతటా కొత్తగా పది వైద్య కళాశాలలను ఇనాగ్యురేట్ చేయనున్నారు. చివరిగా టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబై కేంద్రంలో విద్యా సమీక్షా కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed