- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారే నా ఫ్యామిలీ, దానికి నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను.. స్టేజి మీదనే బోరున ఏడ్చేసిన సమంత
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.
ఇదిలా ఉంటే.. గత వారం రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సామ్ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోయింది. అయితే ఈ వివాదం తర్వాత సమంత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘జిగ్రా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్‌లో సమంత ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను చాలా రోజుల తర్వాత అభిమానులందరినీ కలుస్తున్నాను. ఇక ఈ ఈవెంట్‌కు పిలిచినప్పుడు నాకు ఒక పర్సనల్ కనెక్ట్ అనిపించింది. ఈ ఫస్ట్ వి వరుసలో కూర్చున్న వారందరు నా జిగ్రాలు. రాహుల్ రవీందర్ నాకు 15 ఏళ్లుగా తెలుసు.. త్రివిక్రమ్ గారితో మూడు సినిమాలు. వీరిద్దరూ లేకుండా నా కెరీర్ ఇలా ఉండేది కాదు.
అలాగే నా బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ లోనిదే. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే, నేను ఎవరు.. ఏంటి అనేది అందరికీ తెలిసింది అంటే మాత్రం కేవలం తెలుగు ప్రేక్షకుల వల్లనే. నేను మీ ప్రేమ వల్లనే ఈ రోజు ఈ స్థానానికి ఎదిగాను. మీరే నా ఫ్యామిలీ. దానికి నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను. ‘ ’ కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జిగ్రా టీమ్” అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక సామ్ అలా స్టేజిపై ఎమోషనల్‌గా మాట్లాడంతో నెటిజన్స్.. సామ్ నీకు మేము ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: సమంత రియల్ హీరో.. ‘జిగ్రా’ ఈవెంట్‌లో ఆలియా కామెంట్స్