కామారెడ్డి జిల్లాలో సంచలనం.. సెలైన్ పెట్టలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రోగి

by Jakkula Mamatha |
కామారెడ్డి జిల్లాలో సంచలనం.. సెలైన్ పెట్టలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రోగి
X

దిశ,గాంధారి: తనకు జ్వరం వచ్చిందంటే సెలైన్ పెట్టలేదని ఏకంగా రోగి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన దుర్భర పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి సెలైన్ పెట్టలేదని ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం జరిగింది. దీంతో పోలీసులు సంబంధిత ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి తిరిగి సెలైన్ పెట్టించి పంపించిన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే ప్రభుత్వ వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇటీవల సరెండర్ కాగా అతని స్థానంలో ఇప్పటివరకు ఎవరిని నియమితులు కాలేదు. దీంతో సామాన్య రోగులకు వైద్య సేవలు అందక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కు చూయించుకొని మందులు తీసుకొని వెళ్దాం అనుకొని వివిధ పల్లెటూర్ల నుంచి వచ్చిన రోగులకు నిరాశే ఎదురవుతోంది.

45 జీపీలు ఒకే ఒక్క పిహెచ్సి హాస్పిటల్..

గ్రామ పంచాయతీలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినా గాంధారి 45 జీపీలు ఉండడంతో దాదాపు జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇందులో సీజనల్ వ్యాధులు ప్రబలించే ఈ కాలంలో వైద్యులు ఉంటేనే ప్రజలను చూసి మందులు పంపించడం జరిగేది కానీ ప్రభుత్వ వైద్యుడే అందుబాటు లేకపోవడంతో వివిధ గ్రామాల మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ప్రజలు డాక్టర్ కోసం ఎదురు చూసి చూసి చివరికి జబ్బుకు సంబంధించిన మందు గోలీలు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక్కడ స్టాఫ్ నర్సే.. డాక్టర్ తర్వాత డాక్టర్ అన్నట్టు!

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ స్టాఫ్ నర్స్ కు డాక్టర్ తర్వాత డాక్టర్ అన్నంత పేరు ఉంది. ఎందుకంటే డాక్టర్ రాకపోతే డాక్టర్ చేయాల్సిన పనులన్నీ ఇంజక్షన్, రక్త పరీక్షలు, పల్స్ చెకప్ ఇలా అన్ని పరీక్షలు చేసి స్టాఫ్ నర్స్ నిర్ధారించుకుని ఏ రోగికి ఏ మందు వేయాలో ఏ టీకా ఇవ్వాలో నిర్ధారించుకొని స్టాఫ్ నర్స్ డాక్టర్ల విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఉన్న డాక్టర్ సరెండరై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నూతన డాక్టర్ను నియమించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ కూడా ఉన్న స్టాఫ్ నర్స్ వారితోనే నెట్టుకుంటూ వస్తున్న దుర్భర పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది..

ప్రభుత్వ ఆసుపత్రి లో కనీసం టాబ్లెట్ సెలైన్లు ఇంజక్షన్లు అన్ని షాటేజ్ ఉన్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఫార్మసిస్టులు తెలపడం జరిగింది. వారు తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట వచ్చిన స్టాక్ మాత్రమే ఇప్పటివరకు మైంటైన్ చేస్తూ వస్తున్నామని అది ఎలా నడిపిస్తున్నామో మాకే తెలుసు అని పై నుంచి రానిది మేము ఏమి చేయాలని వారు వారి ధోరణిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైనుండి రానిది మేము ఎక్కడ నుంచి రోగులకు ఇవ్వాలి అని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడేమో రోగులు తనకు తప్పనిసరిగా సైలెంట్ పెట్టాలని మాత్రలు ఇవ్వాలని అంటే మా దగ్గర లేనివి మేము ఎక్కడ నుంచి తీసుకురావాలి.. ఉంటే మేము పెట్టమా.. ఆసుపత్రి ఉన్నది ప్రజల కోసమే కదా కానీ స్టాక్ లేదు. అప్పుడెప్పుడో రెండు నెలల క్రితం వచ్చింది. ఇప్పటివరకు రాలేదు ఉన్నదానితోనే నెట్టుకుంటూ వస్తున్నాం అని ఆసుపత్రి సిబ్బంది తెలపడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed