Dragon fruit: ప్రతిరోజూ అరముక్క డ్రాగన్ ఫ్రూట్ తినండి.. ఈ వ్యాధులన్నీ పరార్..!!

by Anjali |   ( Updated:2024-10-09 04:04:19.0  )
Dragon fruit: ప్రతిరోజూ అరముక్క డ్రాగన్ ఫ్రూట్ తినండి.. ఈ వ్యాధులన్నీ పరార్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రాగన్ పండు ధర ఎక్కువగానే ఉంటుంది.. కానీ బెనిఫిట్స్ మాత్రం బోలెడు. లాభాలున్నాయని అతిగా కూడా తినకూడదు. లిమిట్‌లో తింటే ఆరోగ్యాన్ని కూడా అంతే పరిమాణంలో అందిస్తుంది. ఈ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా సాధారణ పేగు కదలికలను ప్రోత్సహించడంలో తోడ్పడుతుంది. అలాగే మధుమేహం, వెయిట్ లాస్ అవ్వడం, మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో సుగుణాలు ఉన్న డ్రాగన్ పండు గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గట్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి తోడ్పడతాయి.

బెస్ట్ మెడిసిన్ డ్రాగన్ ఫ్రూట్..

పింక్, పసుపు రంగుల్లో లభించే డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు అతితక్కువగా ఉంటాయి. కాగా బరువు తగ్గడానికి మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. దీనిలో బీటా సైనిన్ అనే సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది కొవ్వు కాలేయ ప్రమాదాన్ని అండ్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించానికి సహకరిస్తుంది. ఈ ఫ్రూట్ లో దట్టంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలను ది చేరకుండా చేస్తాయి. అలాగే తొందరగా వృద్ధాప్య లక్షణాలు కనిపించవు. చర్మంపై ముడతలు రాకుండా యవ్వనంగా మెరిసిపోతారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఇన్సులిన్ నిరోధకను నియంత్రించడంలో తోడ్పడుతుంది.

పిల్లలకు తప్పకుండా తినిపించండి..

ఆర్థరైటిస్ ‌వ్యాధితో బాధపడుతోన్న వారు డ్రాగన్ ఫ్రూట్ తింటే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే దీనిలో ఫాస్పరస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. కాగా ప్రతిరోజూ పిల్లలకు అరముక్క డ్రాగన్ ఫ్రూట్ తినిపించండి. ఈ వ్యాధులన్నీ దరి చేరకుండా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో డ్రాగన్ ఫ్రూట్ బెస్ట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. చిన్న పేగుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా డ్రాగన్ మేలు చేస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story