ఏమీ అనుకోవద్దు తారక్.. నాకు ఆ సినిమా అస్సలు నచ్చలేదు : ప్రభాస్ సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-09 04:24:49.0  )
ఏమీ అనుకోవద్దు తారక్.. నాకు ఆ సినిమా అస్సలు నచ్చలేదు : ప్రభాస్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా ‘కల్కీ2898ఏడీ’ మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కీ 2, ఫౌజీ వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ప్రభాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు, తారక్‌కు పడదని.. ఓ దర్శకుడి వల్ల విభేదాలున్నాయనే వార్తలు తరుచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. కానీ ఇది ఓ గాసిప్ మాత్రమే అని.. రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సైతం ప్రభాస్ చూసి పర్సనల్‌గా కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తోంది. అవన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ నటించిన ఓ మూవీ డార్లింగ్‌కు నచ్చలేదట. ఆ విషయం స్టేజీపై ప్రభాస్ స్వయంగా చెప్పారు. డార్లింగ్ తన కెరీర్‌లో ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు చేసి తర్వాత వర్షం మూవీ చేస్తున్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విడుదలైంది. ఓ సందర్భంలో బహిరంగంగా వేదికపై తనకు ఈ మూవీ నచ్చలేదని చెప్పేశాడట.

ప్రభాస్ మాట్లాడుతూ.. నాకు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నచ్చలేదు. సారీ తారక్ ఏమీ అనుకోకు. ఈ మూవీ చాలా పెద్ద హిట్. బట్ ఈ చిత్రం నాకు నచ్చలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తారక్ సింహాద్రి సినిమా చేశాడు. తర్వాత ఓ రోజు నన్ను పిలిచి ఈ సినిమా ప్రివ్యూ చూడాలంటూ తీసుకెళ్లి చూపించాడు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయింది. నాకు మెంటల్ ఎక్కేసింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది? భవిష్యత్తులో ఇతనితో అసలు సినిమానే చేయలేను అన్నాను.. కానీ ఆయనతోనే వరుసగా సినిమాలు చేశాను” అంటూ ఓ వేదికలో ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇక తన మనసులో మాట ప్రభాస్ చెప్పడంతో ఎన్టీఆర్ దాన్ని నవ్వుతూ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed