ఘనంగా మున్సిపల్ చైర్మన్ నిశ్చితార్థం.. హాజరుకాలేకపోయిన ఎమ్మెల్సీ కవిత

by Disha News Web Desk |
ఘనంగా మున్సిపల్ చైర్మన్ నిశ్చితార్థం.. హాజరుకాలేకపోయిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి నిశ్చితార్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాయి సుధీర్‌తో మున్సిపల్ చైర్మన్‌కు వివాహం కుదిరింది. శనివారం రాజంపేట మండలం పొందుర్తి శివారులోని ఖాజాస్ గెస్ట్ హౌస్‌లో నిశ్చితార్థం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏప్రిల్ 7న వీరి వివాహం జరగనుంది. కరోనా బారినపడటంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నిశ్చితార్థానికి హాజరుకాలేకపోయారు.

Advertisement

Next Story