గాంధీ జయంతి నాడు జంతువధ..

by Sumithra |
గాంధీ జయంతి నాడు జంతువధ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అహింసను ఆయుధంగా చేసుకుని స్వతంత్ర్యం తెచ్చిన మహాత్ముడి జయంతి సందర్భంగా ప్రభుత్వం జంతువధ, మద్యం విక్రయాలను నిషేధించింది. అక్టోబర్ 2 అనగానే చాలా మంది మహాత్మా గాంధీ జయంతి కంటే మద్యం, మాంసం విక్రయాలు ఉండవనేది కొండగుర్తు. కానీ మహాత్మాగాంధీ జయంతి ఆదివారం రావడంతో మద్యం, మాంస ప్రియులకు, విక్రయదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. ఆర్యనగర్ ప్రాంతంలోని ఓ మటన్ షాప్ లో జోరుగా మాంసం విక్రయాలు కొనసాగాయి.

అక్టోబర్ 2న ప్రభుత్వం మాంసం విక్రయించడం నిషేధించింనా ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో జోరుగా మాంసం విక్రయించారు. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే మున్సిపల్ సిబ్బందికి తాము ముడుపులు ఇచ్చామని బహిర్గతంగా చెప్పడంతో ప్రజలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మద్యం షాపు పక్కనే ఉండే పర్మిట్ రూం నిర్వాహకులు మద్యంను నిల్వ చేసుకుని అడిగిన వారికి లేదనకుండా సరఫరా చేశారు. ఆదివారం కావడంతో మద్యం, మాంసం ప్రియులు అధిక ధరను వెచ్చించైనా వాటిని కొనుగోలు చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నగరంలో తనిఖీలు చేయాల్సిన బల్ధియా అధికారులు, ఎక్సైజ్ అధికారులు సైలెంట్ గా ఉండడంతో ఈ తతంగం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed