- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Dhanpal Suryanarayana :అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు
దిశ, ప్రతినిధి,నిజామాబాద్ నవంబర్ 04:సరస్వతీ నిలయాలుగా ఉండాల్సిన సర్కారు బడులు సమస్యలకు నిలయాలుగా మారాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ( MLA Dhanpal Suryanarayana )అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో తను గమనించిన అసౌకర్యాలపై మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఇంటర్నేషన్ విద్యా విధానం అందిస్తామన్న రేవంత్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే విఫలమైందన్నారు. ముందుగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ల పైనా,కాంట్రాక్టర్లపైనా,ఉన్న ప్రేమ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపైన లేదన్నారు. పెండింగులో ఉన్న మిడ్ డే మీల్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ధన్ పాల్ డిమాండ్ చేశారు.సరస్వతీ నిలయాలుగా ఉండాల్సిన సర్కారు బడులు సమస్యలకు నిలయాలుగా మారాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.
ప్రభుత్వాలు మారుతున్న పాఠశాలల దుస్థితి మారడం లేదు..
ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారడం లేదని ఎమ్మెల్యే అన్నారు. కోటగల్లి బాలికల హై స్కూల్ కు ఒకప్పుడు మంచి పేరుండేదని,కనీస సదుపాయాలు లేకపోవడంతో.. విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి పేరెంట్స్ ఆసక్తిని కనబరచడం లేదన్నారు. విద్యార్థుల తరగతి గదుల్లో కనీసం లైట్లు కూడా లేవన్నారు. దీంతో అంతగా వెలుతురు లేని తరగతి గదుల్లోనే విద్యను అభ్యసించే విద్యార్థులకు కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కాలంగా పాఠశాలకు మరమ్మతులు లేకపోవడంతో.. గోడలు నెర్రెలు బాసిన పరిస్థితి ఉందని, గోడలు ఎప్పుడు కూలుతాయోననే భయంతోనే విద్యార్ధులు చదువుకుంటున్నారని ఆయనన్నారు. ఏడు వందల మంది విద్యార్ధులు చదివే పాఠశాలలో కేవలం ఆరు టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని, వాటి నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. తరగతి గదుల్లోని కిటికీలకు తలుపులు లేకపోవడంతో బయటి నుంచి కోతులు తరగతి గదుల్లోకి వస్తున్నాయని,విద్యార్ధులు భయంతో చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని చెపుతున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో కరెంటు షాకుతో విద్యార్థి మృతి
వర్షాకాలంతో గోడలకు కరెంటు షాకు తగులుతుందని, గతంలో పాఠశాల నిర్వహణ లోపం కారణంగా ఒక విద్యార్థి కరెంటు షాకుతో చనిపోయిందన్నారు. విద్యార్థి చనిపోయిన తరువాత కూడా అధికారులు కాని..అధ్యాపక బృందం కానీ స్పందించకుండా వేలాడుతున్న కరెంటు వైర్లను చూసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. కరెంటు వైర్లు ఇలాగే వేలాడితే మరో కరెంట్ షాకు ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు జరగక మునుపే స్పందించి బాధ్యతను చాటుకోవాలని ఎమ్మెల్యే పాఠశాల హెడ్మాస్టర్ కు సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా టీచర్లు విధులకు హజరు కావడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు రోజులుగా విద్యార్థుల హాజరు పట్టికలో అటెండెన్స్ కూడా వేయకపోవడంపై టీచర్లను ప్రశ్నించారు.
మెనూ ప్రకారం డైట్ ఇవ్వడం లేదు..
మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదని,విద్యార్థులకు గుడ్డు,సాంబర్ పెట్టాల్సింది పెట్టకుండా అడిగితే మెస్ బిల్లులు రావడం లేదనడంపై ఎమ్మెల్యే భోజన ఏజెన్సీపై సీరియస్ అయ్యారు. ఇదేనా మీరు పర్యవేక్షించే తీరు అని హెడ్మాస్టర్ ను కూడా మందలించారు. జిల్లా విద్యాధికారి ఏసీ రూంకు పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టర్ల పైనా,అధికార పార్టీ నాయకుల పైనా ఉన్న ప్రేమ పేద విద్యార్థుల పట్ల లేదా అని ప్రశ్నించారు. ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు విద్యార్ధుల మధ్యాహ్న భోజన బిల్లులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. తొమ్మిది,పదో తరగతి విద్యార్ధులకు కూడా మధ్యాహ్న భోజన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోతోందన్నారు. బిల్లులు అందక విద్యార్ధులకు భోజన ఏజెన్సీలు నాణ్యమైన భోజనాన్ని అందించలేకపోతున్నాయని ధన్ పాల్ అన్నారు. తక్షణమే భోజన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాయిరెడ్డి, ఉపాధ్యాయులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మఠం పవన్, మరవర్ కృష్ణ, బాబీసింగ్, పల్నాటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.