ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించండి..

by Naveena |
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించండి..
X

దిశ, ఆర్మూర్ : వైద్యశాఖ అధికారులు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారిని రాజశ్రీ అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవాఖానకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దావఖానాలోని రిజిస్టర్లను, రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పటల్ కు వచ్చే ప్రజల పట్ల వారి ఆరోగ్యం జాగ్రత్తల పట్ల వైద్య సిబ్బందికి పలు సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బస్తీ దవాఖానా వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.

Next Story