నాసిరకంగా కార్పొరేట్ చదువులు.. జేఈఈ మెయిన్స్‌లో సున్నా ఫలితాలు

by Hamsa |
నాసిరకంగా కార్పొరేట్ చదువులు.. జేఈఈ మెయిన్స్‌లో సున్నా ఫలితాలు
X

దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ 2023ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క కార్పొరేట్ కళాశాలగాని కార్పొరేట్ కో చింగ్ సెంటర్ విద్యార్థికిగాని ఆలిండి యా స్థాయిలో ఒక్క ర్యాంకు రాలేదు. జాతీయ స్థాయి ర్యాంకు అటుంచి కనీ సం రాష్ర్టస్థాయి ర్యాంకు రాలేదు. ర్యాం కుల సంగతి ఏమో గాని కనీసం ఫలితా ల గురించి ఏ విద్యా సంస్థ ఒక్క ప్రకటన జారీ చేయకపోవడం విశేషం. కళాశాలలో, కోచింగ్ సెంటర్ లలో అడ్మిషన్ ల సమయంలో పీఆర్ఓ లను పెట్టి లక్షలు పెట్టి ప్రచారం చేసుకునే కార్పొ రేట్ విద్యాసంస్థలు ఫలితాలకు వచ్చే సరికి ముఖం చాటేయడం గమనార్హం. అలిండియా స్థాయిలో జరిగే పోటీ ప్రవే శ పరీక్షలకు కోచింగ్ లు ఇస్తామని గొప్ప లు చెప్పుకునే కళాశాలలు, కోచింగ్ సెంటర్ లకు శనివారం వచ్చిన ఫలితా లు నిరాశ కలిగించాయి. వాటిని ప్రచా రం చేస్తే నవ్వుల పాలు కావడం ఖా యం. దానితో పాటే కొత్త విద్యాసంవత్స రం అడ్మిషన్ లు గోవిందా అని సైలెన్స్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ఎస్ఆర్ విద్యా సంస్థకు పదుల సంఖ్యలో బ్రాంచ్ లు ఉన్నాయి. వేల సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది జిల్లాలో నారాయణ కళాశాల కొత్తగా ఏర్పాటు చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం షహిన్ అనే మరో కార్పొరేట్ కళాశాల ఏర్పాటు కాగా విస్థరణలో ఉంది. ఆకాష్ అనే కార్పోరేట్ కోచింగ్ సెంటర్ ఏర్పడి రెండు సంవత్సరాలు కావాస్తుంది. శ్రీ చైతన్య కు పాఠశాల స్థాయి నుంచే కరిక్యూలం అంటు ప్రచారం జరుగుతుంది. ఇవి కాకుండానే కోన్ని ప్రైవేట్ జూనియర్ కళాశా లలు నీట్, జేఈఈ, ఎంసేట్ లాంటి కోచింగ్ లు ఇస్తామని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తు న్నాయి. కానీ 2023 జేఈఈ మెయిన్స్ ఫలితాలకు వచ్చే సరికి ఉమ్మడి జిల్లా కు చెందిన ఒక్క కార్పోరేట్ కళాశాలకు లేదా కోచింగ్ సెంటర్ కు ఒక్క ర్యాంకు రాకపోవడం తో అందులో లక్షలు పోసి చదువుకోంటున్న విద్యార్థుల పరిస్థితిదారుణంగా మారింది. సీని యర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పోటీపడే జేఈఈ లాంటి పరీక్షలలో మంచి పర్సంటైల్ సాధించకపోవడంతో జేఈఈ అడ్వా న్స్ పరీక్షలలో పరిస్థితి ఏమిటని చర్చ జరుగుతుంది.

నిజామాబాద్ జిల్లాలో కార్పోరేట్ చదువులు నాసీరకంగా ఉంటున్నాయి. హైద్రాబాద్ కు వేళ్లి చదివించలేమని నిజామాబాద్ జిల్లాలో చది వించే పిల్లల తల్లిదండ్రులకు కార్పోరేట్ విద్యా సంస్థలు ఫలితాలలో షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ ఫీజులను జిల్లాలోనే వసూలు చేయించి, విద్యార్ధులకు బట్టి చదువులు బుర్రలకు ఎక్కడం లేదు. డిల్లీలో ఐనా గల్లిలో ఐనా మాది ఓక్కటే ఎడ్యుకేటేడ్ కరిక్యూలం అంటు ప్రచారం చేసుకుని వందల సంఖ్యలో విద్యా ర్ధులను చెర్చుకుంటున్నా కార్పొరేట్ కళాశాలలో ఫలితాలు దారుణంగా ఉన్నాయి. హైద్రాబాద్ తో పాటు మెట్రోఫాలిటన్ నగరాలలో కార్పొరేట్ విద్యాసంస్థలైన చైనా విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్ధులు ఓత్తిడి భరించలేక చేసుకుంటున్న ఆఘాయిత్యాలు పిల్లల తల్లిధండ్రులను కలవరపెడుతున్నాయి. దానితో అయా కార్పోరేట్ విద్యా సంస్థలు నిజామాబాద్ జిల్లాలో అడుగుపెట్టాయి. లోకల్ ప్రైవేట్ కళాశాలలను నాశనం చేస్తు కార్పొరేట్ కల్చర్ అంటు డే కం రేసిడేన్సియల్ గా అడుగు పెట్టినాయి. పిల్లలు తమ ముందు ఉన్నట్లు ఉంటుందని మెట్రోపాలిటన్ నగరాల స్థాయిలో లక్షల్లో ఫీజులు పోసి చదివించిన ఫలితాలలో తమ పిల్లలకు ర్యాంకులు రాకపోవడంతో వారికలలు కల్ల లవుతున్నాయి. జేఈఈ మెయిన్స్ కోచింగ్ కోసం లక్షల ఫీజులు వసూలు చేసిన కార్పోరేట్ సంస్థలు శనివారం నాటి ఫలితాలలో ఫేయిల్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కార్పోరేట్ కళాశాలలు కోచింగ్ సేంటర్ లు జేఈఈ ఫలితాలలో ఫేయిల్ అయిన ప్రైవేట్ కాలేజీ కాకతీయ మాత్రం ఫలితాలలో జిల్లా పరువును నిలిపింది. కాకాతీయ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్ధులు మంచిఫలితాలను సాధించారు.

Advertisement

Next Story