- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగిపోర్లుతున్న వాగులు,చెరువులు
దిశ, భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి మండలంలోని కప్పల వాగు పొంగిపొర్లుతుంది. అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. పంట నష్టం వాటిల్లింది. రోడ్ల పై నుండి ప్రవహిస్తున్న నీరుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో ఇప్పటి వరకు ముచ్కూర్ గ్రామంలో 3, దేవక్కపేట్ లో ఒక ఇల్లు కూలిపోయింది.
ఈమేరకు తహసీల్దార్ శ్రీధర్ వెల్లడించారు. పట్టణంలో మొగిలి చెరువు పూర్తిగా నిండడంతో దాని కింద ఉన్న కాలనీలు నీటితో జలమయం అయ్యాయి. ఇంట్లో నుండి బయటకు రాని పరిస్థితి కాలనీ వాసులకు నెలుకొంది. వేల్పూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా నీటితో నిండి పోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని ఎస్సీ కాలనీలో కూలి పోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లను సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా పోలీస్ స్టేషన్ కు లేదా 100 నంబర్ కి కాల్ చెయ్యాలని కోరారు.