- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంది : ఎమ్మెల్యే షిండే
దిశ, పిట్లం : అకాల వర్షంకు నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడుస్తామ అధైర్య పడవద్దని ఆదుకుంటామని అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం పిట్లం మండలంలోని ధర్మారం, కారేగామ్, గోద్మేగాం, కంబాపూర్, తిమ్మానగర్ తండా, హస్నాపూర్, అన్నారం, పిట్లం గ్రామాలలో పర్యటించి రైతుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ధైర్యంగా ఉండాలంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, రైతులతో మమేకమై సుమారు రెండు గంటల పాటు పంట పొలాలను పరిశీలిస్తూ రైతులకు ధైర్యం నింపారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ధాన్యాన్ని శుభ్రంగా ఆరబెట్టాలని రైతులను కోరారు.
కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్ల పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తిరిగి రైతులకు కలబుల్లి మాటలు చెబుతున్నారని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేసిందో వివరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రైతుల సంక్షేమం కొరకు రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టి పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, అనుకోకుండా ఏదైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ రైతు కుటుంబానికి కేవలం వారం రోజులలోనే ఐదు లక్షల బీమా సొమ్మును అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్నామని అన్నారు.
గత ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించారని, సాగు నీటి వసతులు లేక ఎన్నో ఎకరాలు బీడు భూములుగా మారాయని, తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక చెరువులలో కుంటలలో పూడిక పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి తలమానికంగా మారిందని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చిన వేళ గ్రామీణ ప్రాంతాలలో తిరిగి రైతులకు ఏం మాటలు చెప్పినా రైతులు నమ్మరని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంతులు వారీగా రైతులకు ఏమేం పథకాలు అందుతున్నాయో, రైతులకు బాగా తెలుసు అని, ఎవరి మాటలు రైతులు నమ్మే పరిస్థితులు లేవని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువులు కుంటలు పూడికలు తీసి రైతులకు రెండు పంటలు పండించుకొని ఆనంద ఉత్సవంతో రైతులు జీవిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల కన్నీటి బాధలు ఎక్కువ అని ప్రస్తుత ప్రభుత్వం రైతుల బాధలు తీర్చే ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత విజయ్, జెడ్పిటిసి అరికెల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి ,మండల పార్టీ ప్రెసిడెంట్ వాసవి రమేష్ , సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నారాయణరెడ్డి , ఎర్ర దుర్గయ్య, సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి , డిసిసిబి డైరెక్టర్ సాయి రెడ్డి,మాజీ జెడ్పిటిసి ప్రతాపరెడ్డి, తహసిల్దార్ రామ్మోహన్ రావ్, అగ్రికల్చర్ ఆఫీసర్ కిషన్, ఏ ఈ ఓ సురేష్ ప్రదీప్ నాయకులు జొన్న శ్రీనివాస్ రెడ్డి, నర్సా గౌడ్, జగదీష్ నవీన్ ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.