- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: 25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత, చికిత్స
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థలందరూ భోజనం చేశారు. అయితే కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి పాఠశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
మరోవైపు విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలను విద్యాశాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వండిన అన్నం, కూరలు, తాగునీరును పరిశీలించారు. శ్యాంపిల్స్ తీసుకున్నారు. అనంతరం ల్యాబ్‌కు తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.