Bus Accident : లోయలో పడిన బస్సు.. ముగ్గురు ప్రయాణికులు మృతి.. 24 మందికి గాయాలు

by Hajipasha |
Bus Accident : లోయలో పడిన బస్సు.. ముగ్గురు ప్రయాణికులు మృతి.. 24 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం అల్మోరా నుంచి హల్ద్వానీ వైపునకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు(Bus Accident) అదుపు తప్పి లోయలో పడిపోయింది. నైనితాల్ జిల్లా భీమ్‌తల్ పట్టణం సమీపంలోని భీమ్‌తల్ – రాణీబాఘ్ మోటార్ రోడ్‌ ఏరియాలో ఉన్న ఆమ్ డాలీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దాదాపు 1500 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయిన ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పోలీసులు, ఎస్‌డీ‌ఆర్ఎఫ్ టీమ్స్, అగ్నిమాపక విభాగం సిబ్బంది సంయుక్త రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. లోయలో నుంచి ప్రయాణికులను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన 24 మందిని చికిత్స నిమిత్తం 15 అంబులెన్సులలో భీమ్‌తల్‌, హల్ద్వానీలలోని ఆస్పత్రులలో చేర్పించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి విచారణ వ్యక్తం చేశారు. నైనితాల్ జిల్లా అధికార యంత్రాంగం అత్యవసర సహాయక చర్యలు చేపట్టిందన్నారు. రెస్క్యూ వర్క్స్‌ను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed