- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Venu Swamy : అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది : వేణు స్వామి
దిశ, వెబ్ డెస్క్ : మనుషుల జాతకాల మేరకు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని.. ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre)తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయి తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్(Sreetej) ను వేణుస్వామి పరామర్శించాడు. రూ.2లక్షల ఆర్థిక సహాయం చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మరోసారి తన సహజ ధోరణిలో జాతకాల గూర్చి మాట్లాడారు. జాతకం బాగుండటానికి ఇలాంటి ఘటనలకు సంబంధం లేదన్నారు.
కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు. గతంలో నేను చెప్పినట్లుగా అల్లు అర్జున్ జాతకం బాగుందని, కష్టకాలం ఎదురైన ఘటనల నుంచి మనిషి ఏం నేర్చుకుని భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తాడన్నది ముఖ్యమని, మనిషి మారడానికి, ఎదగడానికి ఇవి ఉపకరిస్తాయన్నారు. కావాలని సంధ్య థియేటర్ వంటి ఘటనలు ఎవరు కావాలని చేయరని, భారీ సంఖ్యలో జనం రావడంతో దుర్ఘటన జరిగిందన్నారు. శ్రీ తేజ్ కోసం మృత్యుంజయ హోమం నా సొంత ఖర్చులతో చేస్తానని వేణుస్వామి ప్రకటించారు.