Mohan Babu: ఇది నా సినీ ప్రయాణంలో గొప్ప మైలురాయి.. మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Mohan Babu: ఇది నా సినీ ప్రయాణంలో గొప్ప మైలురాయి.. మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు(Mohan Babu) గత కొద్ది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. మంచు మనోజ్(Manoj), మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు. అయితే ఒకరోజు మనోజ్ తండ్రి ఇంటికి వెళ్లి తన కూతురు లోపల ఉందని చెప్తున్నా.. కానీ వాచ్‌మెన్ ఇంట్లోకి పంపలేదు. ఈ నేపథ్యంలోనే మీడియా వాళ్లు మోహన్ బాబు ఇంటికి వెళ్లగా.. ఆయన దాడి చేశారు.

ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదు అయింది. దీని గురించి కోర్ట్‌ చుట్టూ తిరుగుతున్నారు. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి పోస్టులు పెడుతున్నారు. తాజాగా, మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘అసెంబ్లీ రౌడీ(Assembly rowdy) (1991) నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్(Gopal) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను.

ఆకట్టుకునే కథాంశంతో పి. వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు నా కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. థియేటర్స్‌లో 200 రోజులు ఆడి రికార్డుల మొత మోగించింది. కలెక్షన్ కింగ్ అనే బిరుదు అందించిన సినిమా కూడా ఇదే. ఈ మూవీలో కేవీ మహాదేవన్(Mahadevan) మ్యూజికల్ హిట్‌లు నేటికీ ప్రతిద్శనిస్తునే ఉన్నాయి’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఓ వీడియోను షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed