- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెదక్ చర్చి వందేళ్ల ప్రస్థానం... ఆకలిలో పుట్టిన చర్చి.. ఆసియాలోనే ద్వితీయ స్థానం..
ఆకలి మంటల్లో పుట్టిన అద్భుత దేవాలయం.. వందేళ్ల పండుగకు సిద్ధమైంది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద చర్చిగా నిలిచింది. మానవత్వానికి.. మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచి మహోన్నత నిర్మాణం మెదక్ చర్చి(Medak Church). వందేళ్ల క్రితం పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టిన కార్యక్రమం.. నేడు చారిత్రక పర్యాటక కేంద్రంగా మారింది. ఇంతటి ఘనకీర్తి కలిగిన చర్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నది. రాష్ట్ర గవర్నర్(Governor Jishnuvev Verma) చర్చిని సందర్శించగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) క్రిస్మస్‌తోపాటు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. - నాగన్నగారి గోపాల్ గౌడ్
ఇంగ్లాండ్ నుంచి 1979లో వచ్చిన వెస్లీయన్ మెథడిస్ట్(Wesleyan Methodist) సభ్యులు మెదక్ ప్రాంతంలో మత ప్రచారం ప్రారంభించారు. అప్పట్లో మత ప్రబోధకుడైన చార్లెస్ వాకర్ పాస్నెట్(Father Charles Passnett) పట్టణంలోని ఓ చిన్న చర్చిలో మత గురువుగా నియమితులయ్యారు. ఆయన మత ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టారు. ప్రస్తుత మిషన్ కాంపౌండ్‌లోని చిన్న చర్చి సమీపంలో నిర్మించిన రెండంతస్తుల భవనంలో నివసించేవారు. ఓరోజు సాయంత్రం భవనం పై అంతస్తునుంచి చర్చిని గమనించాడు. చర్చి కన్నా తాను నివసించే భవనం ఎత్తుగా ఉండడం సరికాదని భావించాడు. ఈ క్రమంలోనే భారీ చర్చి నిర్మించాలని సంకల్పించాడు. ఇంగ్లాండ్(England)లోని స్నేహితులకు తన ఆలోచన చెప్పగా.. వారు తమ వంతు సహకారం అందించేందుకు భరోసా ఇచ్చారు. అప్పటికే నాటి హైదరాబాద్(Hyderabad) రాష్ట్రంలో భయంకరమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. మెతుకు సీమలో దుర్భిక్షం నెలకొంది. పంటలు పండే పరిస్థితి లేక పనులు దొరక్క ప్రజలకు ఉపాధి కరువైంది. పేదలకు పని కల్పించడంతోపాటు ఆహారం అందించేందుకు.. చార్లెస్ వాకర్ పాస్నెట్ పనికి ఆహారం తరహాలో చర్చి నిర్మాణానికి పిలుపునిచ్చారు. ఈ విషయం తెలిసిన మెదక్ ప్రాంతవాసులే కాక పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు ముందుకువచ్చారు. చర్చి నిర్మాణ పనులు 1914లో ప్రారంభం కాగా, 1924లో పూర్తయ్యాయి.
చర్చి నిర్మాణంలో ప్రత్యేకతలు...
చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకత. అలాగే చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్లు తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేల తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్(Bible)లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు నిలుస్తున్నాయి. ఏసుప్రభు(Lord Jesus)కు ప్రధానంగా 12 మంది శిష్యులు.. వారి గుర్తుగా 12 మెట్లు నిర్మించారు.
సూర్య కిరణాలు... సుందర దృశ్యాలు...
చర్చి మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బారి రూపొందించారు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనబడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు పడమరనపడే కాంతిపుంజలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి వేరువేరు సంవత్సరాల్లో అమర్చినట్లు చెబుతుంటారు.
తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం..
ఏసు పుట్టుకను తెలియజేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో మరియా, యేసేపు, బాల యేసు ఎడమవైపు గొల్లలు మధ్యలో గాబ్రియల్ లోక రక్షకులు కుడివైపు జ్ఞానులు ఉంటారు. పై భాగంలో యేసుకి ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్దమనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టుకకు 700 ఏళ్లకు క్రితమే ఏసుప్రభు పుడతాడని యేష యా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయన గుర్తుగానే పెద్దమనిషి చిత్రం పెట్టారు.
యేసు సిలువ వృత్తాంతం పడమర కిటికీలో...
ఏను సిలువ సందర్భాన్ని తెలియజేసి ఈ కిటికీని 1958లో అమర్చారు. శిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చొని ఉన్న తల్లి మరియా, మీద చెయ్యి పట్టుకొని నిలబడిన మరిమ్మ దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతో పాటు ఏసు శిష్యుడు యేహన్ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్ కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్ళ కడతాయి. కుడివైపు బల్లెం పట్టుకొని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తాడు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వాక్యాలు ఉన్నాయి.
చర్చి నిర్మాణంలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్ ల ప్రతిభ..
మహా చర్చి నిర్మాణంలో దేశ విదేశాలకు చెందిన ఇంజనీర్ ల అద్భుత ప్రతిభ నైపుణ్యం ఉంది. 1914 లో చర్చి నిర్మాణం ప్రారంభించగా ఇటలీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు ఉన్నాను. చర్చి నమూనాను ఐరోపా గోధిక్ శైలి లో బ్రిటిష్ ఇంజనీర్ బ్రాద్ షా రూపొందించగా థామస్ ఏడ్వార్డ్ వాస్తు శిల్పిగా పని చేశారు. దంగు సున్నం, రాళ్ళ తో 200 అడుగుల పొడగు, 100 అడుగుల వెడల్పుతో రెండు అంతస్తులు నిర్మించిన ఈ చర్చి ప్రార్థనాలయానికి 175 అడుగుల ఎత్తులో గోపురం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. చర్చిలో ఒకే సారి 5000 వేల మంది ప్రార్థన చేసుకోవచ్చు. చర్చిలో ధ్వని రాకుండా రబ్బరు, పత్తిని వినియోగించి పైకప్పు వేశారు.ప్రధాన ద్వారానికి స్వాగత తోరణం హైదారాబాద్ కు చెందిన కంపెనీ నిర్మించారు. 1924 లో ఏసు క్రీస్తు జననం 25 న క్రిస్మస్ రోజే ప్రారంభించారు.
బిషప్ ల పర్యవేక్షణలో సేవలు...
మెదక్ కేథడ్రల్ చర్చి(Medak Cathedral Church) కు ఇప్పటి వరకు 8 మంది బిషప్ లు సేవలు అందించారు. చర్చి ఆఫ్ ఇండియా (Church of India)పరిధిలో 24 డయాసిస్ లు ఉన్నాయి. వీటిలో మెదక్ దయాసీస్ ఒకటి. 1947 సెప్టెంబర్ 30 న ఆవిర్భవించింది. దీని పరిధిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలు వస్తాయి. క్రైస్తవ సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి బిషప్ ను ఎన్నుకుంటారు. పదవీ కాలం 67 ఏళ్ళ వయసు వరకు పదవీలో కొనసాగుతారు. చర్చి ఆధ్వర్యంలో ఉన్న వైద్య శాలలు, విద్యా సంస్థలు, శిశు సంరక్షణ కేంద్రాలు, వృద్ధుల ఆశ్రమాలను పర్యవేక్షిస్తారు. సామాజిక సేవ కార్యక్రమాలు, పండగ సందర్భంగా దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రస్తుతం కరీంనగర్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఆచార్య కె. రూబెన్ మార్క్ (Bishop Right Reverend Dr. Acharya K. Reuben Mark)మెదక్ కు ఇంచార్జి గా వ్యవహరిస్తున్నారు.
సీఎస్‌ఐకి 8 మంది బిషప్‌లు
మెదక్ సీఎస్ఐ లో ఎనిమిది మంది బిషప్ లు ప్రాతినిధ్యం వహించారు.
1. ప్రాంక్ విట్టేకర్ (Prank Whittaker)
2. బీ జి ప్రసాదరావు (BG Prasada Rao)
3. ఎబెర్ ప్రిస్ట్లీ (Eber Priestley)
4. బి పి సుగంధర్ (BP Sugandar)
5. పి. విక్టర్ ప్రేమ్ నగర్ (P. Victor Prem Nagar)
6. హెచ్ డి ఎల్ అబ్రహం (HDL Abraham)
7. టి ఎస్ కనకరత్నం (TS Kanakaratnam)
8. ఏ సల్మాన్ రాజ్ (A Salman Raj)
భారీస్థాయిలో వందేళ్ల ఉత్సవాలు..
మెదక్‌లోని ప్రఖ్యాత కేథడ్రాల్ చర్చి నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఉత్సవాలు భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. చర్చిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. వందేళ్ల ఉత్సవాలు వైభవంగా చేసేలా చార్లెస్ వాకర్ పాస్నేట్ మనవడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణేదేవ్ వర్మ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందుకోసం అధికారులతో పాటు చర్చి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
* మెదక్ చర్చిని కేవలం క్రిస్టియన్‌లు మాత్రమే కాదు అన్ని వర్గాల వారు భక్తితో విశ్వసిస్తారు. చాలామంది ప్రార్థనలు చేయడంతో పాటు మొక్కులు కూడా మొక్కుకుంటారు. కోర్కెలు ఫలించాయన్న నమ్మకంతో చాలామంది తమ పిల్లలకు యేసు, యేసయ్య, యేసుప్రభు, యేసుబాబు తరహా పేర్లు పెట్టుకుంటారు. చర్చి ప్రాశస్త్యం పలుదిశల వ్యాప్తి చెందడంతో కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharashtra)తో పాటు భారీగా విదేశీయులు(Foreigners) సైతం చర్చి దర్శనానికి వస్తుంటారు.
మెదక్ బిషప్ నుంచి మోడరేటర్ బాధ్యతలు
మెదక్ కేథడ్రాల్ చర్చి ఆరవ బిషప్‌గా పనిచేసిన సుగంధ సౌత్ ఇండియా మోడరేటర్‌గా కూడా పని చేశారు. చెన్నై కేంద్రంగా ఉండే మోడరేటర్ పరిధి తమిళనాడు, కేరళతో శ్రీలంక కూడా ఉంటుంది. మెదక్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించిన సుగంధ ఉన్నత స్థానానికి చేరడాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు.