- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: ఆ పాపం పోవాలంటే రాహుల్ పంచ తీర్థాలు తిరగాలి.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మట్లాడుతూ.. హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లిన పాపాన పోలేదని అన్నారు. ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg)లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారని, ఆయన చరిత్ర నిక్షిప్తం అయి ఉన్న గదుల్లోకి సందర్శకులను సైతం వెళ్లనివ్వడం లేదని కామెంట్ చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను నత్తనడకన కొనసాగించిందని.. బీజేపీ (BJP) వెంటపడి మరీ ఆ పనులను పూర్తి చేయించిందని గుర్తు చేశారు.
అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ (Congress Party) అవమానించినందుకు ఆయనకు సంబంధించిన పంచ తీర్థాలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) సందర్శించాలని.. అప్పుడు గానీ పాపాలు పోవని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ (KCR) ఆయన సొంత డబ్బులతో పెట్టలేదని.. ప్రజల సొమ్ముతో పెట్టారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) ఎపిసోడ్ వెనుక తమకు చాలా అనుమానాలు ఉన్నాయని.. అయితే, ఆ అంశంపై చర్చ అవసరం లేదని తెలిపారు. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి తరలిపోవాలని కాంగ్రెస్ (Congress) నాయకులు కోరుకుటుంన్నారని.. అదే జరిగితే తెలంగాణ (Telangana)కు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ (Congress Party) ముఖ్య నేతలు ఇప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry)పై అనుచిత వ్యా్ఖ్యలు చేయకుండా సీఎం అదుపులో పెట్టాలని బండి సంజయ్ సూచించారు.