క్రీస్తు బోధనలు భావితరాలకు అందించాలి

by Naveena |
క్రీస్తు బోధనలు భావితరాలకు అందించాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఏసుక్రీస్తు బోధనలు భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కల్వరీ యంబి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ఎంపీ డికె అరుణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏసు ప్రభువు బోధనలైన స్వార్థ రహిత జీవనం,ప్రేమా,దయ,క్షమించే గుణం,జ్ఞానాన్ని పంచుకోవడం లాంటి సూక్తులను పాటించి ఎందరికో జ్ఞానం అందించారని ఆయన అన్నారు. పవిత్రమైన క్రిస్మస్ పండుగ సందర్భంగా..జ్ఞానాన్ని అందించేందుకు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతర ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాస్టర్ ఎస్.వరప్రసాద్,స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్,మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత,వైస్ చైర్మన్ విజయ్ కుమార్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,మిథున్ రెడ్డి,సిజె బెనహర్,క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు శ్యామ్యుల్,ఫాస్టర్స్ జాకబ్,డ్యానియల్ సుదీర్,మరియన్,వరప్రసాద్,కౌన్సిలర్లు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed