- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Arvind Dharmapuri: ఎంఐఎం పార్టీ ఈ దేశానికి పట్టిన క్యాన్సర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 03:ఎంఐఎం పార్టీ ఈ దేశానికి పట్టిన క్యాన్సర్ అని,క్యాన్సర్ కు ఫేస్ ఉండదు..ఉంటే మాత్రం అది అసదుద్ధీన్ ఓవైసీలాగే ఉంటుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) అన్నారు. ఈ దేశానికి పట్టిన అతిపెద్ద రోగం ఎంఐఎంపార్టీయేనని ఎంఐఎం పార్టీపైనా,ఆ పార్టీ చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ యాక్టు అతిపెద్ద దుర్మార్గపు చట్టమని అర్వింద్ అన్నారు. ఈ యాక్టులోఉన్న దుర్మార్గం ఏంటంటే ఏదైనా భూమిని ఇది మాది అని, ఔరంగజేబు మనవడు మాతాతకు గిఫ్ట్ ఇచ్చిండని చెపితే చాలు ఆ భూమి లిటిగేషన్ లో పడిపోతదన్నారు. ఆ లిటిగేషన్ వివాదం జిల్లా కోర్టుకు పోవడానికి లేదని,వక్ఫ్ ట్రిబ్యునల్ కే పోవాలన్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్ లో నలుగురైదుగురు జడ్జిలుంటారు..వాంరతా ముస్లీంలే ఉంటారని, వేరే మతం వారుండరని, ట్రిబ్యునల్ తీర్పు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా వస్తే దానికి తిరుగుండదు.. బాధితుడు సుప్రీం కోర్టుకు కూడా న్యాయం కోసం పోవడానికి అవకాశం లేని చట్టం వక్ఫ్ చట్టమని అర్వింద్ అన్నారు.దీనికన్నా దుర్మార్గం చట్టం ఎక్కడా ఉండదని,ఇలాంటి చట్టాలను కరకరా కోసిపారేయాల్సిన అవసరంఉందన్నారు. రాజ్యాంగంలోంచి తీసేయాలన్నారు. ఈ చట్టం తెచ్చినోళ్లు కూడా బుద్ధిలేని కాంగ్రెసోళ్లేనని అర్వింద్ ఘాటుగా అన్నారు. పార్లమెంట్ లో బిల్లు ఏ విధంగా పాసైతే దాని ప్రకారం ఉండాలని ఓవైసీకి అర్వింద్ హెచ్చరించారు.లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలని అర్వింద్ అన్నారు.