- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తల్లిదండ్రుల ఋణం తీర్చలేనిది..
దిశ, నవీపేట్ : తల్లిదండ్రుల ఋణం తీర్చలేనిదని, వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని వ్యక్తులు తెలిపారు. మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో శనివారం మాతా-పిత కృతజ్ఞత పూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేదోచ్చరణల మధ్య తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై రాజారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం పెరుగుతుందని అలా జరగకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు. మాతా పితా కృతజ్ఞత మహోత్సవ కార్యక్రమంతో పిల్లల్లో కుటుంబ విలువలు పెరిగి, విలువలు పెరుగుతాయని అన్నారు.
ఇదే కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ ప్రవీణ్ తాడూరి మాట్లాడుతూ జీతాల విలువలు జీవితాలను మారుస్తున్నాయని అటువంటి పరిస్థితుల్లో, తల్లిదండ్రులు తమ చిన్నారులతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరారు. ఇదే కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ రావు మాట్లాడుతూ పాదపూజలాంటి కార్యక్రమం రానున్న తరాలకు మార్గదర్శనం చూపుతుందని హర్షం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు. ఫోన్లలో ఎటువంటి యాప్స్ వాడుతున్నారో నిత్యం గమనిస్తూ ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ వాత్సల్యం పెంపొందించే విధంగా పాదస్పర్శతో ఆశిర్వచనం పొందే మాత-పితా పూజోత్సవ కార్యక్రమం పిల్లలకు ఉన్నతమైన భావాలను పెంపొందిస్తుందని అన్నారు.
తల్లిదండ్రులు ఆటలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థుల చేసిన నృత్యాలు ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పీ.ఆర్.టీ.యూ మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్, గోవర్ధన్ పంతులు, కరెస్పాండెంట్ హన్మాండ్లు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.