- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తడపాకల్ విద్యార్థినికి సాహిత్య పురస్కారం..
దిశ, ఏర్గట్ల : మండలంలోని తడపాకల్ జడ్పీ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న డేగల వైష్ణవికి "తెలుగు తేజం" పురస్కారం లభించింది. చిన్నతనంలోనే సాహిత్య పరంగా ఎంతో కృషి చేస్తున్నందుకు, కవిత్వ, కథ, సరళ వచన, శతక ప్రక్రియలలో అద్భుతంగా రాణిస్తున్నందుకు ఈ పురస్కారాన్ని 'తెలుగు కూటమి సాహిత్య సంస్థ' విజయవాడ వారు అందజేస్తున్నారు. ఇప్పటికే సరళ వచన శతకంలో రెండు పుస్తకాలు ఆవిష్కరించిన వైష్ణవి త్వరలో "చిన్నారి కథలు" అనే సంకలనంతో ముందుకు రాబోతుంది.
ఈ పురస్కారాన్ని వచ్చే మార్చి నెలలో హైదరాబాదులో అందుకుంటున్నట్టు పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు. వైష్ణవికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మంగళవారం పాఠశాల బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాములు, పాఠశాల చైర్మన్ ఎనుగందుల శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం నాగప్ప, గంగాధర్, కృష్ణప్రసాద్, రవీందర్, విజయ్, నరేందర్, స్వప్న, విజయలక్ష్మి, సుజాత పాల్గొన్నారు.