- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Madanmohan : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
దిశ,తాడ్వాయి: వరుణదేవుడు కనికరించడంతో ఈ ఏడాది భారీ వర్షాలకి జలాశయాలు,చెరువులు, నీటివనరులన్నీ జలకళ సంతరించుకున్నందున మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్( MLA Madanmohan)ఆకాంక్షించారు.ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ..మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.అందులో భాగంగానే మత్స్యకారులకు ఏడాది పొడవునా జీవనోపాధి కల్పించి ,ఆర్థిక భరోసా కల్పించేలా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందని గుర్తుచేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉన్న మొత్తం 217 చెరువులలో ఆయా మండలాల వారిగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.అనంతరం మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వచ్చిన నందివాడ గ్రామానికి చెందిన మహిళలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు శివాజీ,రాజీవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు జక్కుల రాజిరెడ్డి,యూత్ అధ్యక్షుడు అఖిల్ రావు,టౌన్ ప్రెసిడెంట్ మెట్టు చంద్రం,సీనియర్ నాయకులు శ్యామ్ రావు,షౌకత్,మాజీ సర్పంచ్ సంజీవులు,సుధాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.