- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలను కలిసిన జీవన్ రెడ్డి
దిశ, ఆర్మూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఇందూరు ఎమ్మెల్సీ, సీఎం తనయ కల్వకుంట్ల కవితను సోమవారం ప్రగతిభవన్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కలిశారు. ఆయన పై నమ్మకంతో త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి, వరుసగా మూడోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా.. సంబరాలు..
ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ అభివృద్ధి ప్రదాత ఆశన్న గారి జీవన్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి ప్రకటించడం పట్ల సోమవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు టపాకాయలు పేల్చి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.