'ప్రతి ఒక్కరు రాజ్యాంగ పఠనం చేయాలి'

by Sumithra |   ( Updated:2022-11-26 15:18:24.0  )
ప్రతి ఒక్కరు రాజ్యాంగ పఠనం చేయాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ఈ రోజు నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో గల భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలీస్ కమిషనర్ నాగరాజు, ఎస్సీ సంఘాల నాయకులతో కలిసి నగర మేయర్ దండు నీతుకిరణ్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీస్ కమిషనర్ నాగరాజు కలిసి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో భాతర రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించాలని రాజ్యాంగ పఠనం చేసే విధంగా అన్ని సంఘాల వారు యువకులను, విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అనంపల్లి ఎల్లయ్య, టీఎన్జీవోస్ అధ్యక్షులు అలుక కిషన్, నాయకులు దండు చంద్రశేఖర్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీలగిరి రాజు, ఎంఆర్సీఎస్ నాయకులు సుధాకర్, ఎస్సీ సంఘాల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్

73వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కేఆర్ నాగరాజు భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా॥ బీఆర్. అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను చూసి భారత రాజ్యాంగంను తయారు చేయడం జరిగిందని, ఆ స్వేచ్చ, ఫలాలను ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామని అన్నారు. భారత రాజ్యాంగం అన్ని కులాల వారుకి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రచనా సంఘం రెండు సవత్సరాల 11 నెలల 17 రోజుల్లో 141 సార్లు చర్చలు, సమావేశాలు జరిపి మరీ రాజ్యాంగ పీఠికకు, 395అధికరణాలు ఎనిమిది షెడ్యూలకు తుది రూపునిచ్చిందని అన్నారు. గత 73 సంవత్సరాలలో భారత రాజ్యాంగం అనేక మార్పుచేర్పులకులోనై విస్తరించింది. ప్రజల హక్కులు, విధుల గురించి క్షుణ్ణంగా వివరించడ జరిగిందని, భావితరాలకు మన రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed