- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పువ్వు గుర్తు పార్టీ పేదోల్ల కడుపుకొట్టి పెద్దోళ్లకు దోచి పెడుతుంది'
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సంధర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ పువ్వు గుర్తు పార్టీ పేదోల్ల కడుపుకొట్టి పెద్దోళ్లకు దోచి పెడుతుందని ధ్వజమెత్తారు.
కేసిఆర్ ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇస్తుంటే అన్ని రకాల ధరలు పెంచి ప్రతి ఇంటి నుంచి నెలకు 4వేల రూపాయలు దోచుకుంటున్నది మోడీ ప్రభుత్వం దరిద్రపు బీజేపీ పాలన వల్ల మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్న మోడి ప్రభుత్వాన్ని విసిరి పారేయాలి అన్నారు. 2011లో కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి 50 రూపాయలు పెంచితే అప్పటి బీజేపీ నాయకురాలు, ఇప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరిచి గగ్గోలు పెట్టినారు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారన్నారు. మోడి ప్రభుత్వం 13 సార్లు 750 రూపాలు పెంచింది.. ప్రజలకు ఎం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సిలిండర్ నిరు పేదల నిత్యావసర వస్తువు.. కుటుంబాల పై గ్యాస్ ధర చాలా ప్రభావం చూపుతుందని 35 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే గ్యాస్ ధర 450 కే వస్తది.. కానీ మోది ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేసింది అన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధాని మోడీ తన గుజరాత్ దోస్తులకు 10 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారు,మోదీ దోస్తు అదాని ఒక్కడికి మాఫీ చేసినన్ని డబ్బులు సబ్సిడీ గా ఇచ్చినా దేశంలో సిలిండర్ 450కే వస్తుంది అన్నారు. మోదీ అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై సీబీఐ, ఈడి దాడులు చేస్తున్నారు. కేసీఆర్ ధైర్యంగా ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు. కేసీఆర్ బిడ్డ కవితను ఇబ్బంది పెడుతున్నారు.. నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు. పేదలను అన్ని విధాలా వేధిస్తున్న బీజేపీని, ఆ పార్టీ నాయకుల్ని ఎక్కడిక్కడ నిలదీయాలి...బుద్ది చెప్పాలి అని పిలుపునిచ్చారు.