- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణాలు ఇప్పిస్తామని 20 లక్షలు వసూలు చేసిన భార్యాభర్తలు..
దిశ, కామారెడ్డి రూరల్ : రుణాలు ఇప్పిస్తామంటూ గ్రామీణ ప్రాంత ప్రజల వద్ద సుమారు 20 లక్షల వరకు భార్యాభర్తలు వసూలు చేశారు. అనంతరం రుణాలు ఇవ్వాలని బాధితులు అడగగా భార్యాభర్తలు ఇద్దరు చేతులెత్తేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో జరిగింది. అంతకు ముందు కొంతమంది బాధితులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నమల్లారెడ్డి గ్రామనికి చెందిన దంపతులు శ్రీహరి- వాణిలు ఏర్పాటు చేసిన జిడీఎఫ్సీ సంస్థ వద్దకు చేరుకొని యజమాని శ్రీహరిని నిలదీశారు. రుణాల కోసం బాధితులు ఇచ్చిన సర్టిఫికెట్లను, డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కొంతమంది డబ్బులు కట్టడంతో వాటికి బదులు జిడీఎఫ్సీ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు సముదాయించారు.
అంతే కాకుండా శ్రీహరి దాచిపెట్టిన సర్టిఫికెట్లను బాధితులు తెప్పించుకొని తీసుకెళ్లారు. అనంతరం బాధితులకు డబ్బులను వారం వ్యవధిలో చెల్లిస్తామని శ్రీహరి హామీ ఇచ్చాడు. వారం రోజులు గడిచినప్పటికీ బాధితులు చెల్లించిన డబ్బులు ఇవ్వక పోవడంతో బాధితులు శ్రీహరి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో శ్రీహరి వాణీ దంపతులు బాధితుల పై తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులందరూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి శ్రీహరి వాణి దంపతులు రుణాలు ఇప్పిస్తామని మోసం చేశారని దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు 20 లక్షల వరకు 250 మంది బాధితుల వద్ద వసూలు చేసి చేతులు ఎత్తేశారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు శ్రీహరి వాణి దంపతులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.