రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి..

by Sumithra |   ( Updated:2023-02-13 09:46:43.0  )
రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి..
X

దిశ, నవీపేట్ : వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించి అప్రకటిత కోతలు విధించడంతో వేసిన పంటలు ఎండుతున్నాయని, సీఎం కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు నమ్మిమోసపోయిన రైతన్నలకు క్షమాపణలు చెప్పి నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొబిన్ ఖాన్ ఆధ్వర్యంలో నీలా, బాగేపల్లి గ్రామాలలో, నవీపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రావు ఆధ్వర్యంలో సోమవారం ఫకీరాబాద్, మధ్దెపల్లి గ్రామాలలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్బీన్ హమ్దాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొని, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నాలుగు గ్రామాలలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలిపిన సందేశాలను పంచుతూ ప్రతి గడపకు హాత్ సే హాత్ జోడో యాత్ర స్టిక్కర్ను అంటించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశంలోని ప్రజలందరినీ ఏకం చేయడానికి భారత్ జోడో యాత్రను ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా పూర్తి చేయడం చేశారన్నారు. దానికి కొనసాగింపుగా జాతీయ కాంగ్రెస్ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహిస్తూ రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వారి వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సుదర్శన్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాటతప్పడం ద్వారా ముఖ్యమంత్రి మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు కరెంటు లేక నీరు అందకపోవడంతో పంటలు నష్టపోతున్నారన్నారు. పంటనష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అదేవిధంగా 24 గంటల కరెంటు ఎంత కష్టమైనా ప్రైవేటు నుండి కొనుగోలు చేసి అయినా రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి రైతులు నష్టపోయారని, కాబట్టి రైతులకు క్షమాపణ చెప్తూ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాదు రేపటి నుండి 24 గంటల కరెంటు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగాశంకర్, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్, బోధన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్, నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జావిద్, రాములు ఎక్స్ ఎంపీపీ బాబు, సాయిలు, గజాయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story