ఆ సొమ్మంతా పంచుతాం.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-08-25 12:44:32.0  )
ఆ సొమ్మంతా పంచుతాం.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయిన ఆయన సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు చోట్ల కూడా తమ పార్టీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను ఓడిస్తామన్నారు. హైదరాబాద్, గజ్వేల్‌లో భూములు అమ్ముకున్న కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డి భూములపై కన్ను వేశారని, అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నారని విమర్శించారు. రింగ్ రోడ్ల పేరుతో తెలంగాణ ప్రజల భూములను లాక్కుంటున్నారన్నారు. భూములను బంధువులకు మార్పిడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లిక్కర్ దుకాణాలు పెడితే ఆయన కూతురు కవిత లిక్కర్ దందా నడిపారని వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని షబ్బీర్ అలీ ఆరోపించారు.

Advertisement

Next Story