ఈ -శ్రామ్ ప్రమాద బీమా పేరిట వసూళ్ల పర్వం..

by Sumithra |   ( Updated:2023-03-05 16:54:28.0  )
ఈ -శ్రామ్ ప్రమాద బీమా పేరిట వసూళ్ల పర్వం..
X

దిశ, తాడ్వాయి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ -శ్రమ్ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికుల ఉచిత నమోదు ప్రక్రియలో భాగంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది చూసిన కొంత మంది గ్రామ యువకులు నిలదీశారు. పూర్తి వివరలలోకెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ ప్రమాద బీమా ఉచితంగా ప్రజలకు అందజేయాల్సింది పోయి ఒక్కొక్కరి వద్ద వంద రూపాయల చొప్పున డబ్బులు తీసుకొని డాటా ఎంట్రీ చేస్తున్నారు.

ఆ తరువాత రిసిప్టు ఇవ్వకపోగా ఎంట్రీ చేసిన తరువాత కార్డు 25 రోజుల తర్వాత గ్రామపంచాయతీకి లేదా ఇంటికి వస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకులు ఉచిత కార్డుకు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని వారిని అడ్డుకుని నిలిపివేశారు. ఈ విషయమై ఎంపీడీవో రాజువీర్ ను వివరణ కోరగా కార్డు డాటా ఎంట్రీ కోసం డబ్బులు వసూలు చెయ్యరాదని తెలియజేసానని అన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉచితంగా అందించే వాటిపై డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకొని వస్తే వారిపై చర్యలు తీస్కుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed