Gandhari : కొనేటప్పుడు కోట్లు... మరమ్మత్తులకు తూట్లు....

by Kalyani |
Gandhari : కొనేటప్పుడు కోట్లు... మరమ్మత్తులకు తూట్లు....
X

దిశ గాంధారి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థికి సురక్షితమైన నీటిని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాల్లో గల హాస్టల్ కు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఒక్క కామారెడ్డి జిల్లాలోనే మొత్తం మీదుగా 18 ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ లు ఉండగా అందులో 6 మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఆర్వో వాటర్ ప్లాంట్లను ఒకేసారి కొనేటప్పుడు కోట్లలో ఖర్చు చేసిన మరమ్మతులకు మాత్రం తూట్లు పడేలా నేటి పరిస్థితి ఉంది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రంలో 18 మినరల్ వాటర్ ప్లాంట్ లో ఉండగా అందులో ఆరు మరమ్మత్తులు చేయించడానికి నిధులు లేవని ఆయా శాఖ అధికారులు తెలపడం జరిగింది.

ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంతకుముందు విధులు నిర్వహించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ కస్తూర్బా ను సందర్శించి వాటర్ ప్లాంట్ ను బాగు చేయించాలని అప్పట్లో ఆదేశించడం జరిగింది. దానికి అధికారులు వారం రోజుల్లో బాగు చేసేస్తాం అని తెలపడంతో కలెక్టర్ కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సిబ్బంది వారం రోజుల్లోనే వాటర్ ప్లాంట్ బాగు చేయిస్తామని ప్రగల్భాలు పలికి నేటికీ కొత్త కలెక్టర్ వచ్చిన ఎక్కడి వేసిన గొంగళి అక్కడనే అన్నట్టు వాటర్ ప్లాంట్ మాత్రం ఇంకా మరమ్మత్తులకు నోచుకోలేదు.

గాంధారి మండల పర్యటనకు మంగళవారం నూతన పదవి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కస్తూర్బా గాంధీ లో మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. అయితే అక్కడ చూసిన వాటర్ ప్లాంట్ ఇంకా బాగుపరచకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. కలెక్టర్లు మారిన ఇంకా వాటర్ ప్లాంట్ మాత్రం మరమ్మతులు నోచుకోలేదు. నాడు కలెక్టర్గా ఉన్న జితేష్ వి పాటిల్ మినరల్ వాటర్ గురించి వివరాలు తెలుసుకుని పాడైపోయిందని ప్రిన్సిపల్ తెలుపగా వెంటనే బాగుపరచాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది బాగు చేయిస్తామని మొక్కుబడిగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే దాదాపు 500 మంది విద్యార్థుల వరకు ఉంటారని వీరికి స్థానిక ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నుండి వాటర్ విక్రయం జరుగుతుందని ప్రిన్సిపల్ శిల్ప తెలిపారు.

టైల్స్ వేసాం అందుకోసమే బాగు చేయించలేదు-ప్రిన్సిపల్ శిల్ప

కస్తూర్బా గాంధీ విద్యాలయంలో టైల్స్ వేస్తున్నందున ఇంకా మినరల్ వాటర్ ప్లాంట్ ను బాగు చేయించలేదని మార్పిడికి అటు ఇటు ఇబ్బందిగా ఉంటుందని అందుకోసమే టైల్స్ మొత్తం వేసిన తర్వాత అప్పుడు బాగు చేయిస్తామని వివరణ ఇవ్వడం కోసమేరుపు. ఇప్పటికి మాత్రం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బయట నుంచి మినరల్ వాటర్ తీసుకొస్తున్నామని సమాధానం ఇచ్చారు. అయితే వర్షాకాలం నీరు ఉంటుంది కానీ ఎండాకాలం మాత్రం బోర్ లో నీరు ఉండటం లేదని ఇది కూడా ఒక కారణమని ప్రిన్సిపల్ శిల్ప తెలపడం జరిగింది.

ఆర్వో వాటర్ ప్లాంట్ లు రిపేర్ ఉన్నది వాస్తవమే-డి సి డి ఓ ఉమారాణి

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆరు ఆర్వో వాటర్ ప్లాంట్ లు మరమ్మత్తులు ఉన్నాయని, దీనికి కావాల్సిన నిధులు ఇంకా సమకూర్చాలని, దీని కోసం ప్రత్యేకంగా పై స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లామని, అతి త్వరలోనే ఆర్వో వాటర్ ప్లాంట్ యొక్క మరమ్మతులు చేపడతామని డి సి డి ఓ ఉమారాణి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed