‘లైట్ తీసుకోవద్దు.. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. పోలీసులకు మెసేజ్

by Kavitha |   ( Updated:2024-10-18 03:12:21.0  )
‘లైట్ తీసుకోవద్దు.. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. పోలీసులకు మెసేజ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈయనను చంపేస్తాము అంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి సల్మాన్‌ను చంపేస్తాం అంటూ బెదిరింపులు వచ్చాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు సందేశం వచ్చింది. ‘లైట్ తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా.. లారేన్స్ బిష్టోయ్‌తో ఉన్న వైరం తొలిగిపోవాలన్నా.. రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందే. ఒక వేళ ఆ మొత్తాన్ని సల్మాన్‌ చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఓ అజ్ఞాత వాసి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సందేశంపై విచారణ చేస్తున్నట్లు ముంబయి పోలీసులు చెప్పారు.

కాగా ఇటీవల సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లారెన్స్‌ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ముంబై పోలీసులు బిష్ణోయ్ కస్టడీ కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు.




Advertisement

Next Story

Most Viewed