తహసీల్దార్ జయశ్రీ ఆస్తులపై పోలీసుల ఆరా..!

by Kalyani |   ( Updated:2024-10-18 03:05:00.0  )
తహసీల్దార్ జయశ్రీ ఆస్తులపై పోలీసుల ఆరా..!
X

దిశ, హుజూర్ నగర్ : ప్రభుత్వ భూమిని పట్టా చేసుకొని రైతుబంధు పొందిన ధరణి ఆపరేటర్ జగదీష్ తో పాటు ఆయనకు సహకరించారని ఆరోపణలో తహసీల్దార్ జయశ్రీ హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్న వారిని సీఐ చరమంద రాజు తమ కస్టడీలోకి తీసుకుని మంగళ, బుధ రెండు రోజులు విచారణ చేశారు. మూడవరోజు గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4-30 గంటల వరకు సుమారు ఐదు గంటల పాటు సీఐ చరమందరాజు తహసీల్దార్ జయశ్రీ ని ఆమెతో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ ను తన ఆఫీసులో విచారణ చేశారని తెలుస్తుంది. ఈ విచారణలో పోలీసులకు జయశ్రీ పూర్తిగా సహకరించినట్లు తెలుస్తుంది.

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో విలువైన ప్రభుత్వ భూమి, మెయిన్ రోడ్డుకు సంబంధించిన 6 సెట్టర్ బిట్లు ఎవరి ప్రోద్బలంతో అసైన్ భూములను పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించినట్లు సమాచారం.. ఇందులో ఏమైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్ అయ్యారా ..!? అని ప్రశ్నించగా ఆమె కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు, అధికారుల పేర్లు కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు విశ్వనీయ సమాచారం.అలాగే జర్నలిస్ట్ ఇండ్ల పట్టాలకు సంబంధించి కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. అలాగే ఆమెకు సంబంధించిన ఆస్తులు వివరాలను పూర్తిగా విచారణ చేసి ఆమె కోదాడ నేరేడుచర్ల లో ఉన్న ఇండ్ల వాల్యుయేషన్ కోసం పోలీసులు ఆ ఇండ్లను కూడా పరిశీలించినట్లు సమాచారం.

రైతుబంధు డబ్బులు తనకు అందలేదని పూర్తిగా డబ్బులు ధరణి ఆపరేటర్ జగదీష్ వాడుకున్నట్లు ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినందున తనే ఆ డబ్బులను పూర్తిగా చెల్లిస్తానని పోలీసులకు తెలిపినట్లు విశ్వనీయ సమాచారం. ధరణి ఆపరేటర్ జగదీష్ కూడా రైతుబంధు డబ్బులను తనే వాడుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మూడు రోజుల పోలీసుల కస్టడీ ముగియడంతో గురువారం సాయంత్రం 5 గంటలకు హుజూర్ నగర్ కోర్టులో సరెండర్ చేశారు. ఆమెను జడ్జ్ జ్యుడీషియల్ రిమాండ్ కు హుజూర్ నగర్ సబ్ జైలు కి పంపించారు.

Advertisement

Next Story

Most Viewed