- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ కారును ఢీ కొట్టిన లారీ.. ఒకరు స్పాట్ డెడ్, ఇద్దరు కానిస్టేబుళ్లకు సీరియస్
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అతివేగం, నిద్రమత్తు, మద్యం మత్తు.. రకరకాల కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక అటవీశాఖ ఉద్యోగి మరణించగా.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంట - నాయుడుపేట జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రాంతానికి పోలీసులు ఒక వాహనంలో వెళ్లి.. ఆ వాహనాన్ని మరో లారీ ఢీ కొట్టింది. కర్రల లోడ్ తో ఉన్న ట్రాక్టర్ ను ఆపి డ్రైవర్ తో పోలీసులు మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగి వెంకటేశ్ (27) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.