Telangana Police: డీప్ ఫేక్ మోసాల‌పై బీ అల‌ర్ట్.. తెలంగాణ పోలీస్ వార్నింగ్

by Ramesh Goud |
Telangana Police: డీప్ ఫేక్ మోసాల‌పై బీ అల‌ర్ట్.. తెలంగాణ పోలీస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసులు(Telangana Police) సైబర్ నేరాల(Cyber Crimes)పై అవగాహన కల్పిస్తూ.. సోషల్ మీడియా(Social Media)లో ఎప్పుడూ యాక్టివ్(Active) గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీప్ ఫేక్ మోసాలపై అలర్ట్ గా ఉండాలని ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. ఓ దిన పత్రిక ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై డీప్ ఫేక్ మోసాల‌పై(Deep Fake Frauds) బీ అల‌ర్ట్(Alert) అని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాగాళ్లు(Cyber Criminals) సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసే ఫోటోలు, వీడియాలనే టార్గెట్ చేస్తారని, అప‌రిచితుల చేతుల్లోకి వ్య‌క్తిగ‌త ఫోటోలు చేర‌నీయ‌కండి అని చెప్పారు. అంతేగాక సామాజిక మాధ్య‌మాల్లో ప్రొఫైల్స్ లాక్(Profile Locks) వినియోగించాలని, అప‌రిచితుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story